పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
ఇందుకూరుపేట మాగుంట కోటంరెడ్డి ఉన్నత పాఠశాలలో 1992-1993 పది బ్యాచ్ కలయిక
32 ఏళ్ల తరువాత కలిశాం…
- పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
- ఇందుకూరుపేట మాగుంట కోటంరెడ్డి ఉన్నత పాఠశాలలో 1992-1993 పది బ్యాచ్ కలయిక
నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం పరిధిలోని మాగుంట కోటంరెడ్డి ఉన్నత పాఠశాలలో 1992-1993 సంవత్సర పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఘనంగా జరిగింది. సుమారు 32 సంవత్సరాలు తరువాత చిన్ననాటి మిత్రులను కలుసుకుని, వారి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ… ఆత్మీయంగా పలకరించుకుంటూ సరదాగా గడిపారు. విద్యాబుద్ధులు నేర్పించిన గురువులను ఈ సందర్భంగా విద్యార్థులు ఘనంగా సన్మానించుకున్నారు. తమ ఉన్నత విద్యాభివృద్ధికి పాటుపడిన పాఠశాల అభివృద్ధికి తోడ్పడుతామని అని వారు ఈ సందర్భంగా తెలిపారు. 32 ఏళ్ల తరువాత అందరం కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.