నీట్ ప్రవేశ పరీక్షలో 69వ ర్యాంకు సాధించిన డాక్టర్ షాహుల్ హమీద్
హమీద్ కు అభినందనలు వెల్లువ
జాతీయ స్థాయిలో సత్తా చాటిన బుచ్చి కుర్రోడు
- నీట్ ప్రవేశ పరీక్షలో 69వ ర్యాంకు సాధించిన డాక్టర్ షాహుల్ హమీద్
- హమీద్ కు అభినందనలు వెల్లువ
బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీకి చెందిన డాక్టర్ షేక్ షాహుల్ హమీద్ దేశవ్యాప్తంగా సూపర్ స్పెషాలిటీ ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ ప్రవేశ పరీక్షలలో సత్తా చాటారు. శుక్రవారం విడుదలైన ఫలితాలలో జాతీయస్థాయిలో 69 ర్యాంకు సాధించాడు. ఈ సందర్భంగా బుచ్చి వైసిపి పట్టణ అధ్యక్షుడు మాజీ వైస్ చైర్మన్ షాహుల్, డాక్టర్ షాహుల్ హమీద్ ను శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం ముస్లిం మత పెద్దలు ముఫ్తీ అబ్ధుల్ హయూమ్ ఖాస్మీ ప్రత్యేక ప్రార్థనలు చేసి డాక్టర్ షాహుల్ హమీద్ కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా షాహుల్ మాట్లాడుతూ… షాహుల్ హమీద్ నీట్ పరీక్షలలో ఆల్ ఇండియా 69 వ ర్యాంకు సాధించడం ముస్లిం సమాజానికే గర్వకారణం అన్నారు. ర్యాంకర్ డాక్టర్ షాహుల్ హమీద్ మాట్లాడుతూ… తన ఈ ఘన విజయానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహమే కారణమన్నారు.