నాణ్యమైన విద్యతో పాటు అన్నీ వసతులు ఉచితంగా అందజేత
మున్సిపల్ జూనియర్ కాలేజిలో స్కిల్‌డెవలప్‌మెంట్‌లో శిక్షణ పొందిన విద్యార్థినీలకు కిట్లు పంపిణీ
నెల్లూరులోని వీఆర్ హైస్కూల్ లో జరుగుతున్న ఆధునీకరణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ
అధికారులకు పలు విషయాలపై సూచనలు చేసిన మంత్రి
వీఆర్ హైస్కూల్ కి పూర్వ వైభవం…
- నాణ్యమైన విద్యతో పాటు అన్నీ వసతులు ఉచితంగా అందజేత
- మున్సిపల్ జూనియర్ కాలేజిలో స్కిల్‌డెవలప్‌మెంట్‌లో శిక్షణ పొందిన విద్యార్థినీలకు కిట్లు పంపిణీ
- నెల్లూరులోని వీఆర్ హైస్కూల్ లో జరుగుతున్న ఆధునీకరణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ
- అధికారులకు పలు విషయాలపై సూచనలు చేసిన మంత్రి
నెల్లూరు వీఆర్ హైస్కూల్‌లో జరుగుతున్న ఆధునీకరణ పనులను రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు. వీఆర్ హైస్కూల్‌లో చేపట్టాల్సిన, చేపట్టిన పనులపై మంత్రి క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. తాను ఇదే హైస్కూల్‌లో చదివిన అనుభూతిని హర్షం వ్యక్తం చేస్తూ తెలియజేశారు. అనంతరం మున్సిపల్ జూనియర్ కాలేజీ లో స్కిల్ డెవలప్ మెంట్‌లో శిక్షణ పొందున్న విద్యార్ధినులకు మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కిట్లు పంపిణీ చేశారు. విద్యార్థినీలతో శిక్షణ పొందిన విధానాన్ని మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు , విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యాభివృద్ధికి సంపూర్ణ మద్దతు ఇచ్చారని తెలియజేశారు. మరో నెలరోజుల్లో అన్నీ వసతులతో వీఆర్ హైస్కూల్‌ను అందుబాటులోకి తెస్తామని మంత్రి చెప్పారు.