వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చూడాలి

మద్దినాయనపల్లి చెరువుపై అక్రమ కట్టడాలను తొలగించాలి

అధికారుల్ని ఆదేశించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని

వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చూడాలి

  • మద్దినాయనపల్లి చెరువుపై అక్రమ కట్టడాలను తొలగించాలి
  • అధికారుల్ని ఆదేశించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని

తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పాకాల మండలం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షతన,ఎంపీడీఓ అరుణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చేశారు. ఎమ్మెల్యేకి ఎంపీడీఓ, అధికారులు,ప్రజా ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. పాకాల మండలంలోని సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధులు, పంచాయతీ సెక్రటరీలను అడిగి తెలుసుకున్నారు. మద్దినాయనపల్లి చెరువు పై అక్రమ కట్టడాలను తొలగించాలని అధికారులకు ఆదేశించారు. వేసవి దృష్ట్య గ్రామాలలో తాగునీటి సమస్య రాకుండా చూడాలి అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పద్మజబాబు రెడ్డి, తహసీల్దార్ సంతోష్ సాయి, మండల స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు,సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *