చిన్నారి వైద్యానికి రూ.5.33 లక్షల ముందస్తు సాయం

సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ చేతుల మీదగా అంద‌జేత‌

చిన్నారి వైద్యానికి రూ.5.33 లక్షల ముందస్తు సాయం

  • సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ చేతుల మీదగా అంద‌జేత‌

అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి మాగర్ల శాన్వి చికిత్స నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వంతో మంజూరైన ₹5.33 విలువైన లెటర్ అఫ్ క్రెడిట్ ను ఎమ్మెల్యే చేతుల మీదుగా ముందస్తు సహాయంగా కుటుంబానికి అందజేశారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గానికి చెందిన మగర్ల శాన్వి అనారోగ్యంతో బాధపడుతోంది. ఆ చిన్నారి వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ₹5.33 లక్షలు విలువైన లెటర్ ఆఫ్ క్రెడిట్ ని సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ తన క్యాంప్ కార్యాలయంలో చిన్నారి బంధువులకు అందజేశారు. సీఎం చంద్రబాబుకు బాధిత కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజ‌య‌శ్రీ‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగంలో చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, పట్టణ అధ్యక్షులు ఆకుతోట రమేష్, కార్యదర్శి ఏజీ.కిషోర్, మండల అధ్యక్షులు కొక్కు శంకరయ్య, బొమ్మన శ్రీధర్, పచ్చవ మాధవ నాయుడు, తడ జడ్పిటిసి సభ్యురాలు ఇందుమతి, కార్తికేయ నియోజకవర్గ టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *