షోరూమ్ ని ప్రారంభించిన కోర్ట్ మూవీ హీరోయిన్ శ్రీదేవి
ముఖ్య అతిధిగా పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
నెల్లూరులో సందడి చేసిన జాబిలి
సీఎంఆర్ లో SOMA EXCLUSIVE సిల్వర్ జ్యువలరీ ఘనంగా ప్రారంభం…
- షోరూమ్ ని ప్రారంభించిన కోర్ట్ మూవీ హీరోయిన్ శ్రీదేవి
- ముఖ్య అతిధిగా పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
- నెల్లూరులో సందడి చేసిన జాబిలి
అక్షయ తృతీయని పురస్కరించుకొని…నెల్లూరు మాగుంట లెఔట్ సి.ఎం.ఆర్ జ్యువలరీ ప్రత్యేక విభాగంలో SOMA EXCLUSIVE సిల్వర్ జ్యువలరీ సి.ఎం.ఆర్ అధినేతలు ప్రారంభించారు. కార్యక్రమానికి విశిష్ఠ అతిధిగా…కోర్ట్ మూవీ హీరోయిన్ శ్రీదేవి, ముఖ్య అతిధిగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలు విచ్చేశారు. అతిధులకి అధినేతలు మావూలూరి శ్రీనివాసరావు, సంతోష్ , గణేష్ లు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు సిల్వర్ జ్యువలరీని ప్రారంభించారు. షోరూమ్ లోని బంగారు ఆభరణాలను వారు సందర్శించారు. హీరోయిన్ జాబిలి బంగారు నగలు ధరిస్తూ సందడి చేశారు. జాబిలిని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. హీరొయిన్ శ్రీదేవి మాట్లాడుతూ సి.ఎం.ఆర్ జ్యువలరీ లో SOMA EXCLUSIVE సిల్వర్ జ్యువలరీ నా చేతుల మీదుగా ఓపెన్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉందన్నారు. నేను గతంలో చూసిన సిల్వర్ జ్యువలరీ కంటే ఇపుడు నేను చూసిన సిల్వర్ జ్యువలరీ చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. సీ.ఎం.ఆర్ జ్యువలరీ అధినేతలు మావూరి శ్రీనివాసరావు , సంతోష్ , గణేష్ మాట్లాడుతూ… బంగారు ధరలు పెరుగుతున్న కారణంగా సిల్వర్ పై బంగారు పూత, జేర్కాన్స్ తో తయారు చేయబడిన SOMA EXCLUSIVE సిల్వర్ జ్యువలరీ మాగుంట లెఔట్ సి.ఎం.ఆర్ జ్యువలరీ లో ప్రారంభించామన్నారు. ఈ అవకాశాన్ని సింహపురి ప్రజలు వినియోగించు కోవాలని కోరారు. కార్యక్రమంలో సీఎంఆర్ చందనా బ్రదర్స్ షోరూమ్ మేనేజర్లు వాసు, ప్రసాద్, శైలేష్ పాల్గొన్నారు.