రెవెన్యూ అధికారుల‌పై ఎమ్మెల్యే సీరియ‌స్‌

గ్రావెల్ అక్ర‌మ త‌ర‌లింపును అడ్డుకున్న ఎమ్మెల్యే కాక‌ర్ల‌

నియోజ‌క‌వ‌ర్గంలో అక్ర‌మ త‌ర‌లింపు జ‌రిగితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలంటూ ఆదేశం

రెవెన్యూ అధికారుల‌పై ఎమ్మెల్యే సీరియ‌స్‌

  • గ్రావెల్ అక్ర‌మ త‌ర‌లింపును అడ్డుకున్న ఎమ్మెల్యే కాక‌ర్ల‌
  • నియోజ‌క‌వ‌ర్గంలో అక్ర‌మ త‌ర‌లింపు జ‌రిగితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలంటూ ఆదేశం

నెల్లూరు జిల్లా వింజమూరు మండలం నల్లగొండలో అక్రమ గ్రావెల్ త‌ర‌లింపును ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అడ్డుకున్నారు. ఈ క్ర‌మంలో అక్క‌డ గ్రావెల్‌ను అక్ర‌మంగా తరలిస్తున్న ఒక హిటాచి, రెండు టిప్పర్లు, నాలుగు ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. గ్రామంలో గత కొన్ని రోజులుగా అక్ర‌మార్కులు అక్రమంగా గ్రావెల్ ను తరలిస్తున్న ప‌ట్టించుకోక‌పోవ‌డంపై ఎమ్మెల్యే తీవ్రంగా మండిప‌డ్డారు. ఈ విధంగా జ‌రుగుతున్న విష‌యం రెవెన్యూ అధికారులకు సమాచారం ఉన్న స్పందించలేదని గ్రామ‌స్తులంతా క‌లిసి ఎమ్మెల్యే కి ఫిర్యాదు చేశారు. దీంతో రెవెన్యూ అధికారుల‌పై సైతం ఎమ్మెల్యే కాక‌ర్ల సురేష్ సీరియ‌స్ అయ్యారు. నియోజకవర్గంలో ఎక్కడైనా అక్రమ గ్రావెల్ త‌ర‌లిస్తే సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *