నెల్లూరులో సోలార్ రూఫ్ టాప్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
సోలార్ ఎనర్జీ సర్వీస్, సమాచారం కోసం ఎక్స్పీరియన్స్ సెంటర్
పది వేల మందికి పైగా వినియోగదారుల కలిగిన జాతీయ సంస్థ
ఫ్రేయర్ ఎనర్జీతో… సోలార్ సేవలు సులభతరం
- నెల్లూరులో సోలార్ రూఫ్ టాప్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- సోలార్ ఎనర్జీ సర్వీస్, సమాచారం కోసం ఎక్స్పీరియన్స్ సెంటర్
- పది వేల మందికి పైగా వినియోగదారుల కలిగిన జాతీయ సంస్థ
భారతదేశంలో ఆరవ అగ్రశ్రేణి సోలార్ కంపెనీగా గుర్తింపు కలిగిన ఫ్రేయర్ ఎనర్జీ సంస్థ రెసిడెన్షియల్ సోలార్ సేవలు నెల్లూరు జిల్లాలో విస్తరించేందుకు సోలార్ రూఫ్ టాప్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభించడం జరిగిందని ఆ సంస్థ ఎండీలు రాధిక చౌదరి, సౌరబ్ మర్ద్ తెలిపారు. నెల్లూరు వేదాయపాలెం నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి బొమ్మ సెంటర్ సమీపంలోని ఎమ్ ఎస్ సి కన్వెన్షన్ హాల్ కాంప్లెక్స్ లో ఫ్రేయర్ ఎనర్జీ ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఫ్రేయర్ ఎనర్జీ అధినేతలు రాధిక చౌదరి, సౌరబ్ మర్ద్ ముఖ్య అతిధులుగా పాల్గొని ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాధికా చౌదరి మాట్లాడుతూ…. సోలార్ ఎనర్జీ సేవలను సులభతరం చేయడమే లక్ష్యంగా ఫ్రేయర్ ఎనర్జీ ఎక్స్పీరియన్స్ సెంటర్ పనిచేయడం జరుగుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా పదివేల మంది వినియోగదారులకు, వంద మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ సిస్టం ఇప్పటివరకు తమ సంస్థ ద్వారా ఏర్పాటు చేశామని ఆమె చెప్పారు. అనంతరం సౌరబ్ మర్ద్ మాట్లాడుతూ… విజయవంతమైన ప్రయోగాల అనంతరం సోలార్ ప్యానెల్స్, కేబుల్ తదితర నాణ్యమైన భాగాలను అందిస్తూ… ప్రత్యేక యాప్ అందుబాటులో ఉంచి జిల్లా ప్రజానీకానికి ఫ్రేయర్ ఎనర్జీ సోలార్ రూఫ్ టాప్ ఎక్స్పీరియన్స్ సెంటర్ సేవలు అందిస్తుందని, ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఫ్రేయర్ ఎనర్జీ ప్రతినిధులు పాల్గొన్నారు.