ట్రాఫిక్ నియంత్ర‌ణ‌కు మెడిక‌వ‌ర్ స‌హ‌కారం

100 మూవ‌బుల్ బారికేడ్స్‌ను అందించిన హాస్పిట‌ల్ యాజ‌మాన్యం

ప్రారంభించిన జిల్లా ఎస్పీ జి. కృష్ణ‌కాంత్‌

ట్రాఫిక్ నియంత్ర‌ణ‌కు మెడిక‌వ‌ర్ స‌హ‌కారం
-100 మూవ‌బుల్ బారికేడ్స్‌ను అందించిన హాస్పిట‌ల్ యాజ‌మాన్యం
-ప్రారంభించిన జిల్లా ఎస్పీ జి. కృష్ణ‌కాంత్‌

నెల్లూరు న‌గ‌రంలో ట్రాఫిక్ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు.. త‌మ వంతు స‌హ‌కారంగా నెల్లూరు మెడిక‌వ‌ర్ హాస్పింట‌ల్ యాజ‌మాన్యం ఏడు ల‌క్ష‌ల రూపాయిలు విలువ చేసే.. 100 మూవ‌బుల్ బారికేడ్స్‌ను పోలీసు శాఖ‌కు అంద‌జేసింది. ఈ బారీకేడ్స్‌ను జిల్లా ఎస్పీ జి. కృష్ణ‌కాంత్ న‌గ‌రంలోని ఉమేష్ చంద్ర క‌న్ఫ‌రెన్స్ హాల్ వ‌ద్ద రిబ్బ‌న్ క‌ట్‌చేసి ప్రారంభించారు. పోలీసు శాఖ‌కు త‌మ‌వంతు స‌హ‌కారంగా.. ట్రాఫిక్ నియంత్ర‌ణ‌కు బారీకేడ్స్ అందించ‌డం జ‌ర‌గింద‌ని ఈసంద‌ర్భంగా మెడిక‌వ‌ర్ హాస్పిట‌ల్స్ ఛైర్మ‌న్ అనిల్ కృష్ణారెడ్డి, సెంట్ర‌ల్ హెడ్ డాక్ట‌ర్ ధీర‌జ్ రెడ్డిలు తెలిపారు. అనంత‌రం ఎస్పీ మాట్లాడుతూ.. నెల్లూరు మెడిక‌వ‌ర్ యాజ‌మాన్యం దాతృత్వానికి పోలీసు శాఖ త‌ర‌ఫున హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో అడిషనల్ యస్.పి. CH. సౌజన్య , న‌గ‌ర DSP సింధు ప్రియ, మెడికవర్ హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్ స‌తీష్, ట్రాఫిక్ CI లు వెంకటరెడ్డి, రామకృష్ణ, SB-1 CI వెంకటేశ్వర రావు, SB-2 CI శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *