చిరున‌వ్వు.. ఓపికే.. సూర్యతేజ ఐఏఎస్ విజ‌య ర‌హ‌స్యం

నుడా వైస్ ఛైర్మ‌న్ ఆత్మీయ వీడ్కోలు స‌భ‌లో ఛైర్మ‌న్ కోటంరెడ్డి

ఘ‌నంగా స‌త్క‌రించిన కోటంరెడ్డి శ్రీ‌నివాసులురెడ్డి దంప‌తులు

చిరున‌వ్వు.. ఓపికే.. సూర్యతేజ ఐఏఎస్ విజ‌య ర‌హ‌స్యం
-నుడా వైస్ ఛైర్మ‌న్ ఆత్మీయ వీడ్కోలు స‌భ‌లో ఛైర్మ‌న్ కోటంరెడ్డి
-ఘ‌నంగా స‌త్క‌రించిన కోటంరెడ్డి శ్రీ‌నివాసులురెడ్డి దంప‌తులు

నెల్లూరు కార్పోరేష‌న్ క‌మిష‌న‌ర్‌.. నుడా వైస్ ఛైర్మ‌న్ సూర్య‌తేజ బ‌దిలీ అయిన విష‌యం తెలిసిందే. ఈసంద‌ర్భంగా నుడా ఛైర్మ‌న్ కోటంరెడ్డి శ్రీ‌నివాసులురెడ్డి ఆధ్వ‌ర్యంలో సోమ‌వారం నుడా కార్యాల‌యంలో ఆయ‌న‌కు ఘ‌న వీడ్కోలు స‌త్కార కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ఈసంద‌ర్భంగా సూర్య‌తేజ దంప‌తుల‌ను కోటంరెడ్డి శ్రీ‌నివాసులురెడ్డి దంప‌తులు ఘ‌నంగా.. భారీ పూల‌మాల‌తో స‌త్క‌రించారు. అలాగే.. నుడా కార్యాల‌యం ఉద్యోగులు, సిబ్బంది పుష్ప‌గుచ్ఛాలు అంద‌జేసి.. శుభాకాంక్షులు తెలిపారు. వేద‌పండితుల‌చే ఆశీర్వ‌చ‌నాలు అందించారు. ఈసంద‌ర్భంగా కోటంరెడ్డి మాట్లాడారు. మోములో చిరునవ్వు, కొండంత ఓపికే సూర్య తేజ విజయ రహస్యం అన్నారు. నుడా వైస్ చైర్మన్ సూర్య తేజ తో కలిసి నుడా అభివృద్ధికి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. కమీషనర్ గా, నుడా వైస్ చైర్మన్ గా సమర్థవంతమైన పరిపాలన అందించారని వెల్లడించారు. సూర్య తేజ బదిలీపై వెళ్లిపోవడం బాధగా ఉన్నప్పటికీ.. ఉన్నత స్థానానికి వెళ్తున్నారని సంతోషం ఉందన్నారు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ఉండే ప్రజల మన్ననలను సూర్య తేజ సంపాదించుకున్నారని అయన కొనియాడారు. ఈ కార్య‌క్ర‌మంలో ఈ అభినందన సభలో కోటంరెడ్డి సతీమణి సంధ్య, కమిషనర్ సూర్య తేజ సతీమణి అమూల్య, CPO హిమబిందు, నుడా సెక్రెటరీ పెంచల‌రెడ్డి, నుడా అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *