ఆసుపత్రిలో రోగులకు, ఆసుపత్రి సిబ్బందికి చీరలు పంపిణీ
ఎమ్మెల్యే విజయశ్రీ చేతుల మీదుగా నిరుపేదలకు అన్నదానం
టిడిపి అధినేత చంద్రబాబు పుట్టినరోజును పండుగులా జరుపుకున్న టీడీపీ శ్రేణులు
సూళ్లూరుపేటలో సీఎం చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు
- ఆసుపత్రిలో రోగులకు, ఆసుపత్రి సిబ్బందికి చీరలు పంపిణీ
- ఎమ్మెల్యే విజయశ్రీ చేతుల మీదుగా నిరుపేదలకు అన్నదానం
- టిడిపి అధినేత చంద్రబాబు పుట్టినరోజును పండుగులా జరుపుకున్న టీడీపీ శ్రేణులు
నిత్యం ప్రజా సేవలో నిమగ్నమవుతూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివారం తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో కార్యదర్శి ఏజీ కిషోర్ పర్యవేక్షణలో ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యఅతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పాల్గొని భారీ కేకును కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, చీరలు పంపిణీ చేసి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు విజన్ ఎంతో గొప్పదని కొనియాడారు. నిరంతర శ్రామికుడు సీఎం చంద్రబాబు అని ఆయన అడుగుజాడల్లో తాము నడుస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేడా సాయి, అలవల శ్రీనివాసులు, కట్టబోయిన వెంకటేష్ యాదవ్, బిజెపి కన్వీనర్ తాటిపర్తి ఆదినారాయణ రెడ్డి, డాక్టర్ రమేష్, ప్రభుత్వాసుపత్రి కమిటీ సభ్యులు సరిత, హనుమంతరావు, రమేష్ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.