రూప్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు

డిప్యూటీ మేయర్ కార్యాలయంలో కేక్ కట్ కటింగ్, మహిళలకు చీరలు పంపిణీ

రూప్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు…

  • డిప్యూటీ మేయర్ కార్యాలయంలో కేక్ కట్ కటింగ్, మహిళలకు చీరలు పంపిణీ

నెల్లూరు నగరం జేమ్స్ గార్డెన్ లోని నగర డిప్యూటీ మేయర్ కార్యాలయంలో రూప్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన తెలుగు తమ్ముళ్లతో కలిసి కేక్ కట్ చేసి… హ్యాపీ బర్త్ డే సీబీఎన్ సార్ అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. టీడీపీ సీనియర్ నాయకులు దార్ల వెంకటేశ్వర్లుతో కలిసి వందలాది మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం రూప్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ…ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో తమ నాయకుడు చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు అస్మమైనుద్దీన్, గోగుల నాగరాజు, నాయకులు నిశ్చల్ కుమార్ రెడ్డి, వడ్లమూడి చంద్ర, అల్లంపాటి జనార్దన్ రెడ్డి, మైనార్టీ నాయకులు హాజీ తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *