పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
పాఠశాల-దేవాలయం రెండూ ఒకటే..!
-పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
-అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. దమ్మపేట మండలలో అమ్మ ఆదర్శ పాఠశాల నిధులతో పూర్తయినా మండలంలోని పాఠశాల వసతులను అశ్వరావుపేట స్థానిక శాసనసభ్యులు జారే ఆదినారాయణ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే మాట్లాడుతూ.. పాఠశాల, దేవాలయం రెండు ఒకటేనని పరిశుభ్రంగా చూసుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని ప్రతి గ్రామంలోని పాఠశాలను గ్రామస్తులే వేసవి సెలవుల్లో జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులు కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ సహకారంతో చొరవ తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ లక్ష్మి, స్థానిక నాయకులు కార్యకర్తలు అభిమానులు ఉన్నారు