నేటి వార్త మాలిక‌

క‌ల్తీలేని వార్త‌లు క‌ల‌క‌లం రేపే క‌థ‌నాలు

ఆత్మకూరులో సీఎం చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలను రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. సీఎం దీర్ఘాయుషు కోరుతూ మహా హోమం, నవ నది జలాలు… సప్త కలశాలతో శాస్త్రోక్తంగా హోమ క్రతువు చేశారు.

గుజరాత్ లో మంత్రి నారాయణ బృందం పర్యటన చేపట్టింది. ఏక్తా నగర్ లో సర్దార్ వల్లభాయి పటేల్ భారీ విగ్రహాన్ని మంత్రి, అధికారులు పరిశీలించారు.

కోవూరులో అర్ధరాత్రి పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ట్రైనీ డీఎస్సీ శివప్రియ, సీఐ సుధాకర్ రెడ్డిలు తమ సిబ్బందితో కలిసి ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశామని వారు తెలిపారు.

కలువాయిలోని వెంకయ్యస్వామి ఆలయ సమీపంలో చేతి బోరు ఆక్రమణకు గురైందని స్థానికులు ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి ఆక్రమణకు గురైన బోరుని వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు.

ఉమ్మడి నెల్లూరు జిల్లాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకల్ని…ప్రజా ప్రతినిధులు, టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

తిరుమల రెండో ఘాట్ రోడ్డులోని భాషికార్ల సన్నిధి మలుపు వద్ద కారు దగ్ధమైంది. ఎగసి పడుతున్న మంటల్ని ఫైర్ సిబ్బంది అదుపు చేశారు. భక్తులకి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

సంగంలోని శ్రీనివాసా ప్రథమ చికిత్సాలయంలో పీఎంపీ డాక్టర్ జగన్మోహన్ మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరంలో డాక్టర్ మాదాల‌ వెంకట తరుణ్, డాక్టర్ దుగ్గుబోయిన వెంకటేశ్వర్లు పాల్గొని ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి.. ఉచితంగా మందులను పంపిణీ చేశారు.

మర్రిపాడు మండలం కదిరినాయుడుపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వాకాడులోని బీసీ కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గూడూరు డిఎస్పి గీతా కుమారి, సీఐ హుస్సేన్ భాష పర్యవేక్షణలో సబ్ ఇన్స్పెక్టర్ పి నాగబాబు, చిట్టమూరు సబ్ ఇన్స్పెక్టర్ బలరామయ్య పోలీస్ సిబ్బందితో బిసి కాలనీని జల్లెడ పట్టారు. సరైన పత్రాలు లేని మూడు బైక్ లను పోలీసులు సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *