ఎలాంటి ప్రమాదం లేకుండా భయటపడ్డ కోనసీమ జిల్లావాసులు
తిరుమల ఘాట్ రోడ్డులో కారు దగ్ధం
- ఎలాంటి ప్రమాదం లేకుండా భయటపడ్డ కోనసీమ జిల్లావాసులు
తిరుమల రెండో ఘాట్ రోడ్డులోని భాషికార్ల సన్నిధి మలుపు వద్ద కారు దగ్ధమైంది. కారులో కోనసీమ జిల్లా రావులపాలెం ప్రాంతానికి చెందిన భక్తులు ప్రయాణిస్తున్నారు. తీవ్రంగా ఎగిసిపడుతున్న మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేశారు. భక్తులకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.