సంతపేట చర్చిలో క్రీస్తు రాకను స్వాగతిస్తూ అర్థరాత్రి ప్రార్థనలు
భారీగా విచ్చేసిన క్రైస్తవ సోదర సోదరీమణులు
బాణాసంచా కాలుస్తుండగా అంటుకున్న మంటలు
తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేసిన భక్తులు
ఎన్3 ఎక్స్క్ల్యూజివ్ కథనం
చర్చిలో భారీ అగ్నిప్రమాదం
- సంతపేట చర్చిలో క్రీస్తు రాకను స్వాగతిస్తూ అర్థరాత్రి ప్రార్థనలు
- భారీగా విచ్చేసిన క్రైస్తవ సోదర సోదరీమణులు
- బాణాసంచా కాలుస్తుండగా అంటుకున్న మంటలు
- తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేసిన భక్తులు
- ఎన్3 ఎక్స్క్ల్యూజివ్ కథనం
నెల్లూరు నగరం సంతపేటలోని సెయింట్ జోసప్ క్యాథడ్రాల్ బిషప్స్ హౌస్ లో శనివారం అర్థరాత్రి క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. తెల్లవారితే ఈస్టర్ పండుగ నేపథ్యంలో క్రీస్తు రాకను స్వాగతిస్తూ అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి ప్రార్థనలు చేపడుతున్నారు. ప్రార్థనల అనంతరం ఏసుప్రభు పునఃరాకను ఆహ్వానిస్తూ ప్రభు ప్రతిమ వద్ద భారీగా బాణాసంచా కాల్చారు. ఈ నేపథ్యంలో అగ్నిరవ్వలు అంటుకుని ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఆ మంటలు కాస్త భారీ అగ్నిప్రమాదానికి దారి తీసింది. దీంతో ప్రార్థనలు చేస్తున్న క్రైస్తవ సోదర సోదరీమణులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఎం జరిగిందో తెలుసుకునే లోపు అంతా కాలి బూడిదైంది. ప్రభు ఆగమనాన్ని స్వాగతిస్తూ చేపట్టిన ప్రార్థనల్లో అనుకోకుండా జరిగిన దుర్ఘటనతో నగరమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చర్చి చరిత్రలో ఇలాంటి ఘటన ఏనాడు జరగలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.