సెయింట్ జోసఫ్స్ కథీడ్రల్ చర్చిలో ప్రత్యేక ప్రార్ధనలు
గుడ్ ఫ్రైడే ప్రాముఖ్యతను వివరించిన బిషప్ ఎండీ ప్రకాశం
పాల్గొన్న టీడీపీ నగరాధ్యక్షుడు మామిడాల మధు
భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే వేడుకలు…
- సెయింట్ జోసఫ్స్ కథీడ్రల్ చర్చిలో ప్రత్యేక ప్రార్ధనలు
- గుడ్ ఫ్రైడే ప్రాముఖ్యతను వివరించిన బిషప్ ఎండీ ప్రకాశం
- పాల్గొన్న టీడీపీ నగరాధ్యక్షుడు మామిడాల మధు
నెల్లూరు సుబేదారుపేటలోని సెయింట్ జోసఫ్స్ కథీడ్రల్ చర్చిలో గుడ్ ఫ్రైడే ని క్రైస్తవ సోదరులు ఘనంగా నిర్వహించారు. ప్రార్ధనా మందిరంలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గుడ్ ఫ్రైడే ప్రాముఖ్యతను ఏసు క్రీస్తు శిలువలో పలికిన మాటల గురించి బిషప్ ఎండీ ప్రకాశం క్రైస్తవ సోదరులకి వివరించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగరాధ్యక్షులు మామిడాల మధు పాల్గొని ఏసుప్రభువుకు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అనంతరం డీఎం ప్రకాశం, మామిడాల మధులు మీడియాతో మాట్లాడారు. ఏసు దయ, ప్రేమ, కృప ప్రజలందరిపై ఉండాలని ప్రార్ధించామన్నారు. పెద్ద సంఖ్యలో క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు.