హ్యాపీ బ‌ర్త్‌డే వీపీఆర్ సార్‌

ఘనంగా ఎంపీ వేమిరెడ్డి ముందస్తు జన్మదిన వేడుకలు

యువ‌త‌తో క‌లిసి కేక్ క‌ట్ చేసిన ఎమ్మెల్యే ప్ర‌శాంతిరెడ్డి

అనాథాశ్రమాలకు నిత్యావసర సరకుల పంపిణీ చేసిన వీపీఆర్ టీమ్‌

ఘనంగా ఎంపీ వేమిరెడ్డి ముందస్తు జన్మదిన వేడుకలు

  • అనాథాశ్రమాలకు నిత్యావసర సరకుల పంపిణీ

నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ముందస్తు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ నెల 19న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పుట్టినరోజు నేపథ్యంలో టిడిపి నాయకులు డేవిన్‌ జాన్‌, అతడి అనుచరులు నెల్లూరు పరిధిలోని గీతామయి వృద్ధుల ఆశ్రమం, వియాని, విశ్వ భారతి అంధుల ఆశ్రమానికి 50 వేల విలువైన నిత్యావసర సరకులను ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి చేతులమీదుగా వితరణ చేశారు. ఈ సందర్భంగా ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ… ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి జన్మదినం సందర్భంగా డేవిడ్‌ జాన్‌ ఇంత మంచి కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని, ఇంతమంది యువత తమ వెంట ఉండటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సొంత డబ్బులు పెట్టుకుని అనాధాశ్రమాలకు నిత్యావసర సరకులు అందించారని కొనియాడారు. యువతకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో రాజేష్ రెడ్డి, మౌళి, శామ్యూల్, హరి, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *