ముద్దాయిని అరెస్ట్ చేసిన సంతపేట పోలీసులు
నిందితుడి వద్ద రూ. 5.40 లక్షల విలువ చేసే 108 గ్రాముల బంగారం స్వాధీనం
మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు
నమ్మించాడు…బంగారంతో ఉడాయించాడు
- ముద్దాయిని అరెస్ట్ చేసిన సంతపేట పోలీసులు
- నిందితుడి వద్ద రూ. 5.40 లక్షల విలువ చేసే 108 గ్రాముల బంగారం స్వాధీనం
- మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు
ఓ వ్యక్తిని నమ్మించి మోసం చేసి బంగారం తీసుకొని వెళ్లిపోయిన ముద్దాయిని సంతపేట పోలీసులు అరెస్ట్ చేశారని రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి రూ. 5.40 లక్షల విలువ చేసే 108 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారన్నారు. సాంకేతికత ఆధారంగా చీటింగ్ కేసును సంతపేట పోలీసులు చేధించారని తెలిపారు. వారిని అడిషనల్ ఎస్పీ సీహెజ్ సౌజన్య అభినందించారన్నారు. ఈ మేరకు డీఎస్పీ శ్రీనివాసరావు సంతపేట పోలీసుస్టేషన్ లో నిందితుడిని మీడియా ఎదుట హాజరుపరచి…కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. సమావేశంలో సంతపేట సీఐ దశరధరామారావు, ఎస్ఐ బాలక్రిష్ణ, ఏఎస్ఐ, సిబ్బంది పాల్గొన్నారు.