నారాయణ అల్లుడు గంటా రవితేజ
నారాయణలో ఇంటర్ కాలేజ్ రాష్ట్రస్థాయి క్రీడలు ప్రారంభం
చదువు.. క్రీడలు.. జీవితంలో ముఖ్యమే..!
-నారాయణ అల్లుడు గంటా రవితేజ
నారాయణలో ఇంటర్ కాలేజ్ రాష్ట్రస్థాయి క్రీడలు ప్రారంభం
అత్యంత ప్రతిష్టాత్మకమైన డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ క్రికెట్ ఫర్ మెన్ రాష్ట్రస్థాయి పోటీలు నెల్లూరు నారాయణ వైద్య విద్యాసంస్థల ప్రాంగణంలో బుధవారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ పోటీలకు ముఖ్య అతిధిగా గంటా రవితేజ హాజరయ్యారు. వైద్య విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఈ క్రికెట్ పోటీలలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. చదువుతోపాటు క్రీడలు కూడా జీవితంలో ఎంతో ముఖ్యమని, గెలుపోటములుతో సంబంధం లేకుండా అందరూ ఉత్సాహంగా ఆడాలన్నారు. అలాగే.. ఈ రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలను నారాయణ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో నిర్వహించడం హర్షణీయం అన్నారు. ఇంకా.. నారాయణ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి. శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 38 మెడికల్ కళాశాల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనడం సంతోషకరం అన్నారు. ఇంకా క్రికెట్ గురించి, దానిపై మక్కువ గురించి అనేక విషయాలను వెళ్లడించారు. అనంతరం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ స్పోర్ట్స్ కమిటీ ఛైర్మన్ త్రిమూర్తిలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నారాయణ టెంటల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అజయ్ రెజినాల్డ్, నారాయణ వైద్య, విద్యా సంస్థల ఓఎస్డీ. ఆర్. సాంబశివరావు, ఆపరేషన్స్ హెడ్ డి. రామారావు, క్యాంపస్ ఇన్‌ఛార్జ్ ఎ. మునిశంకర్, టోర్నీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ సెల్విబాబు తదితరులు పాల్గొన్నారు.