అధునాత‌న హంగుల‌తో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్

సూళ్లూరుపేటలో ఈ నెల 18న అట్ట‌హాసంగా ప్రారంభం

తక్కువ ఖర్చుతో అంద‌నున్న‌ కార్పొరేట్ కంటి వైద్యం

వెన్నెల వెలుగు లాంటి కంటి చూపును ఇవ్వడమే ఉద్దేశం

వివ‌రాలు వెల్ల‌డించిన అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ నిర్వాహ‌కులు

అధునాత‌న హంగుల‌తో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్

  • సూళ్లూరుపేటలో ఈ నెల 18న అట్ట‌హాసంగా ప్రారంభం
  • తక్కువ ఖర్చుతో అంద‌నున్న‌ కార్పొరేట్ కంటి వైద్యం
  • వెన్నెల వెలుగు లాంటి కంటి చూపును ఇవ్వడమే ఉద్దేశం
  • వివ‌రాలు వెల్ల‌డించిన అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ నిర్వాహ‌కులు

వెన్నెల వెలుగు లాంటి కంటి చూపును ఇవ్వడమే త‌మ‌ ముఖ్య ఉద్దేశమని మెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ నిర్వాహకులు తెలియ‌జేశారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ కు సమీపంలో తక్కువ ఖర్చుతో కార్పొరేట్ కంటి వైద్యం అందించే అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ అధునాత‌న వ‌స‌తుల‌తో అందుబాటులోకి రాబోతుంది. హాస్పిటల్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ మోదుగుల రమేష్ చంద్ర ఆధ్వర్యంలో కార్పొరేట్ వైద్యం అందించ‌నున్నారు. అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ నూతన 23వ బ్రాంచ్‌ను సూళ్లూరుపేట‌లో ఈనెల 18న ప్రారంభించనున్నట్లు హాస్పిటల్ డైరెక్టర్ మోదుగుల పార్థసారథి తెలిపారు. ఈ మేర‌కు బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, హాస్పిటల్ డైరెక్టర్లు అరుణ, విజయ్ పాల్గొని మాట్లాడారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో 22 బ్రాంచ్‌లతో ప్రజల విశ్వాసాన్ని పొందిన తమ సంస్థ, కంటి చికిత్సలో విశిష్ట సేవలందిస్తోందని తెలిపారు. సూళ్లూరుపేటలో 23వ బ్రాంచ్ ప్రారంభోత్సవం అనంతరం తొలి రెండు నెలల పాటు ఉచిత ఓపి సేవలు అందిస్తామన్నారు. అలాగే ఆరోగ్యశ్రీ, తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ఉచిత వైద్య సేవలు కల్పించనున్నట్టు వెల్లడించారు. అత్యాధునిక అమెరికన్ టెక్నాలజీ, అనుభవజ్ఞులైన వైద్యుల సహకారంతో నడిచే ఈ హాస్పిటల్‌లో కార్పొరేట్ స్థాయి కంటి చికిత్సలు ఇప్పుడు సాధారణ ప్రజానీకానికీ అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. సూళ్లూరుపేటలో ఈ స్థాయి ఆసుపత్రి ప్రారంభం కావడం స్థానిక ప్రజలకు సౌక‌ర్య‌వంత‌మ‌వుతుంద‌ని, ఇది ఆరోగ్య రంగంలో ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఇది మా హాస్పిటల్ కాదు… మన హాస్పిటల్ అని వారు సంతోషం వ్యక్తం చేశారు. దీంతో పాటు పట్టణ చుట్టుపక్కల పల్లెల్లో వారికి కూడా కంటి వైద్యం ఉచితంగా అందించ‌నున్న‌ట్లు వారు తెలియ‌జేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *