నారాయణ ఆదేశాలనే తుంగలో తొక్కిన కార్పొరేషన్ అధికారులు
షాపులకి లైసెన్స్ ఉన్నా..ఎందుకు మూసేశారు..?
ఆకతాయిలకి అడ్డాగా మారిన ఆ…మార్కెట్
60 ఏళ్ల చరిత్ర కలిగిన మార్కెట్ పై ఎన్ 3 న్యూస్ ప్రతినిధి రమణారెడ్డి ఫేస్ టూ ఫేస్
మినిస్టర్ మాటంటే లెక్కలేదా…
- నారాయణ ఆదేశాలనే తుంగలో తొక్కిన కార్పొరేషన్ అధికారులు
- షాపులకి లైసెన్స్ ఉన్నా…ఎందుకు మూసేశారు…?
- ఆకతాయిలకి అడ్డాగా మారిన ఆ…మార్కెట్
- 60 ఏళ్ల చరిత్ర కలిగిన మార్కెట్ పై ఎన్ 3 న్యూస్ ప్రతినిధి రమణారెడ్డి ఫేస్ టూ ఫేస్
ఆ మార్కెట్ కి 60 ఏళ్లు చరిత్ర ఉంది… నిత్యావసరాలు, చేపలు, మటన్, చికెన్ తోపాటు బీఫ్ మాంసం అందుబాటులో ఉండేవి… అయితే ఏమైందో ఏమో కానీ…గత ఆరు నెలలుగా బీఫ్ కి సంబంధించిన మార్కెట్ ని కార్పొరేషన్ అధికారులు మూసేశారు… షాపులకి లైసెన్సులు కలిగి ఉన్నా….షాపులను మూసేయడంపై అనేక అనుమానాలు, విమర్శలకు దారి తీస్తోంది…దీంతో ఆ మార్కెట్ ఆకతాయిలకి అడ్డాగా మారిపోయింది… ఇటీవల ఆ మార్కెట్ ని మంత్రి నారాయణ సందర్శించారు…దుకాణదారులందరూ షాపులు తెరుచుకొని ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకోవాలని…షాపు తీసుకోకపోతే వాటిని పేదవారికి అందించాలని ఆయన కార్పొరేషన్ అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. కొందరు లైసెన్స్ దారులు గ్రీవెన్స్ లో కమిషనర్ కు వినతి పత్రం అందచేశారు. వెంటనే కమిషనర్ సానుకూలంగా స్పందించి షాపులు ఓపెన్ చేసుకోవాలని ఆదేశించారు. అయితే డిప్యూటీ కమిషనర్ మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని లైసెన్స్ దారులు ఆరోపించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి లైసెన్సులు కలిగిన వారికి షాపులను కేటాయించాలని వారు వేడుకుంటున్నారు…..అసలు ఆ మార్కెట్ ఎక్కడ…? ఆ మార్కెట్ చరిత్ర ఏంటి…? బీఫ్ మార్కెట్ ని మాత్రమే ఎందుకు మూసేశారు…? తదితర అంశాలపై….ఎన్ న్యూస్ ప్రతినిధి రమణారెడ్డి ఫేస్ టూ ఫేస్….