భారీ అగ్ని ప్రమాదం..

పూర్తిగా మంటల్లో కాలిపోయిన మూడు ఇళ్లులు భారీ ఆస్తి నష్టం

కొత్తగూడెం పాలగుంపు గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్

సర్వం కోల్పోయామంటూ బోరున విలపిస్తోన్న బాధితులు

భారీ అగ్ని ప్రమాదం…

  • పూర్తిగా మంటల్లో కాలిపోయిన మూడు ఇళ్లులు
  • భారీ ఆస్తి నష్టం
  • కొత్తగూడెం పాలగుంపు గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్
  • సర్వం కోల్పోయామంటూ బోరున విలపిస్తోన్న బాధితులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం దురదపాడు పంచాయతీ పాలగుంపు గ్రామంలోని ఇళ్లల్లో ఆదివారం సాయంత్రం విద్యుత్ షార్ట్ సర్య్కూట్ జరిగింది. దీంతో గ్రామంలోని మడకం రాజు, గిగా బాబురావు, నల్లబెల్లి స్వప్నలకు చెందిన మూడు మూడు ఇల్లులు అగ్నికి పూర్తిగా దగ్నమయ్యాయి. చుట్టు పక్కల వారు నీళ్లతో మంటలను ఆర్పేందుకు ఎంత ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే ఇళ్లుతోపాటు…లోపల ఉన్న సామాగ్రి, నగదు, దుస్తులు అన్నీ అగ్నికి బూడిదైపోయాయని బాధితులు వాపోయారు. సర్వం కోల్పోయామని…కట్టుబట్టలే మిగిలాయని…ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని బాధితులు తెలిపారు. ప్రభుత్వం, అధికారులు తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *