నెల్లూరులో సీపీఎం నిరసన
వక్ఫ్ బిల్లు వెనక్కి తీసుకోకపోతే పోరాటమే…
- నెల్లూరులో సీపీఎం నిరసన
ముస్లిం సమాజానికి నష్టం కలిగే వక్ఫ్ బిల్ సవరణ చట్టానికి వ్యతిరేకిస్తూ… సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.. వక్ఫ్ బిల్లును వెంటనే రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య, సిపిఐ నగర సహాయ కార్యదర్శి సయ్యద్ సిరాజ్ మీడియాతో మాట్లాడుతూ… బిజెపి అధికారంలో వచ్చిన తర్వాత మోడీ ప్రభుత్వం ముస్లింలను టార్గెట్ చేస్తూ ముస్లిం సమాజానికి నష్టం కలిగే విధంగా అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. సెక్యులర్ పార్టీలు అయిన టిడిపి, జనసేన పార్టీలు తమ మద్దతును ఉపసంహరించుకోవాలన్నారు. రాష్ట్రంలో ఈ చట్టాన్ని అమలుపరచకుండా చూడాలి లేని పక్షంలో ప్రజల నుండి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, సిపిఐ సీనియర్ నాయకులు, భవన నిర్మాణం కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.