మా.. నిరుద్యోగుల‌కు ఉద్యోగాలివ్వాల్సిందే!

స్థానికుల భూములు తీసుకుని.. స్థానికుల‌కు అవ‌కాశాలివ్వ‌రా..?

జిందాల్ ప‌వ‌ర్ ప్లాంట్‌వ‌ద్ద ఆందోళ‌న‌కు దిగిన గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌

మా.. నిరుద్యోగుల‌కు ఉద్యోగాలివ్వాల్సిందే..!
-స్థానికుల భూములు తీసుకుని.. స్థానికుల‌కు అవ‌కాశాలివ్వ‌రా..?
-జిందాల్ ప‌వ‌ర్ ప్లాంట్‌వ‌ద్ద ఆందోళ‌న‌కు దిగిన గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌

ప‌ర‌శ్ర‌మ‌ల‌కు వ్య‌తిరేకం కాదు.. వారి విధానాల‌కే తాము వ్య‌తిరేకం అంటూ.. గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ మండిప‌డ్డారు. ఈమేర‌కు ఆయ‌న గూడూరు నియోజ‌క‌వ‌ర్గంలోని.. చిల్లకూరు మండలం తమ్మినపట్నం లో జిందాల్ పవర్ ప్లాంట్ ఎదుట స్థానిక నిరుద్యోగుల‌తో క‌ల‌సి.. ఆందోళ‌న‌కు దిగారు. స్థానికంగా ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటుచేసినా..అందుకోసం స్థానికుల వ‌ద్ద భూములు తీసుకున్నా.. స్థానికుల‌కు మాత్రం ఉద్యోగాలివ్వ‌రా అంటూ ఆయ‌న ప్ర‌శ్నించారు. స్థానిక యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించాలంటూ.. కంపెనీ ప్ర‌తినిధుల‌ను కోరారు. కొంద‌రితో అక్క‌డిక‌క్క‌డే ఎమ్మెల్యే ఫోన్‌లో విన్నవించారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. సీఎస్ఆర్ ఫండ్స్ కూడా స్థానికంగా ఉప‌యోగ‌ప‌డేలా ఖ‌ర్చు చేయాల‌ని డిమాండ్ చేశారు. ప‌రిశ్ర‌మ‌ల‌కు తామెప్పుడూ వ్య‌తిరేకం కాద‌ని ఈసంద‌ర్భంగా ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో స్థానిక నిరుద్యోగులు, యువ‌కులు, నాయ‌కులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *