జగన్ బెయిల్ ని వెంటనే రద్దు చేయాలి
నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి
16 నెలలు జైలు…11 ఏళ్లు బెయిల్
- జగన్ బెయిల్ ని వెంటనే రద్దు చేయాలి
- నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి
రాష్టంలో అల్లర్లు సృష్టించాలనే ఉద్దేశ్యంతోనే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని… నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి జనాల్లో తిరిగితే.. విద్వేషాలు రెచ్చగొట్టే ప్రమాదముందని వెంటనే ఆయన బెయిల్ రద్దు చెయ్యాలని కోటంరెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 16 నెలల జైలులో ఉండి.. 11 ఏళ్లుగా బెయిల్ మీద తిరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి.. రాజకీయ లబ్ది కోసం రాయలసీమలో ప్యాక్షన్ రాజకీయాలకు తెరలేపుతున్నాడని మండిపడ్డారు. శాంతిభద్రతలకు విఘాతం కల్పించి.. తద్వారా రాజకీయ లబ్ది పొందాలని జగన్ చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.