కృష్ణుడి ఆలయంలో చోరీ – మరో రెండు ఇళ్లలో చోరీకి యత్నం
సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, క్లూస్ టీమ్
వెంకటాచలంలో దొంగలు హల్‌చల్
- కృష్ణుడి ఆలయంలో చోరీ
- మరో రెండు ఇళ్లలో చోరీకి యత్నం
- సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, క్లూస్ టీమ్
నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని కృష్ణుడి ఆలయంలో తాళం పగలగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఈ విషయమై గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ సంఘటన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలు సేకరించారు. పూజారి, ఆలయ నిర్వాహకుల వివరాల మేరకు రెండు సవర్ల బంగారు తాలిబొట్లు, హుండీ పగలగొట్టి సుమారు 35వేల రూపాయలు నగదు అపహరించకపోయినట్లు తెలిపారు. అదే వీధిలో మరో రెండు ఇళ్లకు తాళాలు పగలగొట్టి చోరీకి ప్రయత్నించారు. ఈ మేరకు పోలీసులు కేసునమోదు చేసి ధర్యాప్తు చేపట్టారు.