కుటుంబాన్ని చూస్తే కంటతడి పెట్టాల్సిందే
వాచ్ ద N3 న్యూస్
నెల్లూరు జిల్లా వింజమూరు మండలానికి కూతవేటు దూరంలో ఉన్న జి బి కే ఆర్ ఎస్టి కాలనీలోని నివాసం ఉంటున్న కిశోర్, అంజలి దంపతులు నిత్యం ఏదో ఒక పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నారు. కిశోర్ తన భార్య,ఇద్దరు పిల్లలతో సంతోషంగా గడుపుతూ, కుటుంబాన్ని నెట్టుకొస్తున్న తరుణంలో ప్రకృతి కన్నెర్ర చేసి ఆ కుటుంబ పెద్ద దిక్కుని మంచానికే పరిమితం చేసేలా, విధి వారి జీవితంలో తీరని శోకాన్ని మిగిల్చింది. వివరాల్లోకెళ్తే కిశోర్ ఓ బేకరీ షాప్ లో రోజు కూలికి పనికి వెళ్తూ, కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు. ఓ రోజు రాత్రి స్నేహితునితో వేటకు వెళుతున్న సమయంలో నందిగుంట సమీపంలో పందుల నుండి రక్షణకు పొలానికి ఏర్పాటు చేసి ఉన్న విద్యుత్ తీగలును, తగలడంతో శరీరం 40% కాలిపోవడం జరిగింది. మృత్యువడి నుండి బయటపడి ప్రస్తుతం మంచానికే పరిమితమైన ఘటన, ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. చంటి బిడ్డల ఆర్తనాదాలు ఒకపక్క, భర్త రోదన మరో పక్క ఆ మహిళకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. విద్యుత్ షాక్ కు గురై 5నెలలు గడుస్తున్నా కనీసం డాక్టర్ కానీ,ఏ ఎన్ ఎం కానీ,ఆశా కార్యకర్త కానీ చూసిన పాపాన పోలేదు అంటే ప్రభుత్వ ఉద్యోగుల తీరు ఎలా ఉందో మనకి కళ్ళకి కనబడుతుంది. స్థానిక ఎంపీటీసీ ఏకసిరి భవాని,ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దృష్టికి తీసుకుపోగా ఎమ్మెల్యే తన వంతుగా 20,000 రూపాయలు అందించి, ప్రభుత్వ సహాయ సహకారాలు అందిస్తామని, డాక్టర్లే ఇంటి వద్దకు వెళ్లి వైద్యం చేయాలని డాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.సంపాదించే మనిషి చతికల పడితే ఆ కుటుంబ పోషణ భారం ఎలా ఉంటుందో ఆ మహిళకే ఎరుక. మా భర్త ఆస్పత్రి ఖర్చులు ఇప్పటికే 2 లక్షలు ఖర్చుచేశామని, మా దగ్గర స్థోమత లేదంటూ, ఎవరైనా దాతలు సహాయం చేయాలని ఆమె చేతులు జోడించి ప్రాధేయపడుతుంది. మా భర్త ఆస్పత్రి ఖర్చులు ఇప్పటికే 2 లక్షలు ఖర్చుచేశామని, మా దగ్గర స్థోమత లేదంటూ, ఎవరైనా దాతలు సహాయం చేయాలనుకుంటే మా అకౌంట్ నెంబర్ 190512010000961 UNION BANK, VINJAMURU, IFC CODE: UBINO819051కి అమౌంట్ పంపించగలరని బాధిత కుటుంబం వేడుకొంది. చూడాలి మరి ఆ అభాగ్యుడినీ ఆదుకొనే దాతలు ఎవరైనా ముందుకు వస్తారో లేదో అని…..!!!