బాబు జగజ్జీవన్ రామ్ జీవితం స్పూర్తి దాయకం

టిడిపి ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు వెంకటరమణయ్య, ఎంఈఎఫ్ నియోజకవర్గ ఇన్చార్జ్ శీనయ్య పొదలకూరు పట్టణంలో ఘనంగా బాబు జగజ్జీవన్ రావు జయంతి వేడుకలు

బాబు జగజ్జీవన్ రామ్ జీవితం స్పూర్తి దాయకం

  • టిడిపి ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు వెంకటరమణయ్య, ఎంఈఎఫ్ నియోజకవర్గ ఇన్చార్జ్ శీనయ్య
  • పొదలకూరు పట్టణంలో ఘనంగా బాబు జగజ్జీవన్ రావు జయంతి వేడుకలు

స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, దివంగత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకమని టిడిపి ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు కొంగి.వెంకట రమణయ్య అన్నారు. జగ్జీవన్ రామ్ 118 జయంతిని పురస్కరించుకుని ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. గొప్ప రాజకీయవేత్తగా, సామాజిక సమానత్వం కోసం జీవితకాలం పోరాటం చేసిన సంస్కరణశీలిగా దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉండే గొప్ప దార్శనికుడు ఆయన అని కొనియాడారు. దళితులు, వెనకబడిన తరగతులు, అణచివేతకు గురైన వర్గాల ఉన్నతికి, వారి హక్కుల సాధనకు నిరంతరం పోరాటాలు, కార్మిక ఉద్యమాలు నడిపారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఆయన పొదలకూరు పట్టణంలోని విగ్రహానికి పూలమాలలు చేసి,కేకు కట్ చేసి మిఠాయిలు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో అలుపూరు శీనయ్య, విరువురు సర్పంచ్ జగన్మోహన్, కలగట్ల సందీప్, గంట. మల్లి, అరుణమ్మ, కొంగి. మస్తానమ్మ,బుజ్జయ్య,పెంచలయ్య,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *