కోడిగుడ్ల లారీని వెనుక వైపు నుంచి ఢీకొట్టిన మరో లారీ
కోవూరులో ఘటన
పగిలిన లారీ టైర్…
- కోడిగుడ్ల లారీని వెనుక వైపు నుంచి ఢీకొట్టిన మరో లారీ
- కోవూరులో ఘటన
కోడిగుడ్ల లోడుతో వెళుతున్న లారీ టైర్ ఒక్క సారిగా పగిలిపోయింది. దీంతో రహదారిపై ఆగి ఉన్న కోడిగుడ్ల లారీని…వెనుక వైపు నుంచి మరో లారీ ఢీకొట్టింది. ఈ సంఘటన నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడు జాతీయ రహదారి శివాలయం వద్ద చోటు చేసుకుంది. ప్రమాదంలో రెండు లారీ డ్రైవర్లకు, క్లీనర్ కు గాయాలు కాగా…లారీలో ఉన్న కోడిగుడ్లు పగిలిపోయాయి. కోడిగుడ్ల లారీ కరివేడు నుంచి నెల్లూరుకి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని… క్రేన్ సహాయంతో ప్రమాదానికి గురైన లారీలను రోడ్డు పక్కకు లాగి పెట్టారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు.