ముస్లిం సోదరులకి హామీ ఇచ్చిన ఎమ్మెల్యే కురుగొండ్ల
వెంకటగిరిలో ఘనంగా రంజాన్ పండుగ
ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కురుగొండ్ల
దర్గాని అభివృద్ధి చేస్తా…
- ముస్లిం సోదరులకి హామీ ఇచ్చిన ఎమ్మెల్యే కురుగొండ్ల
- వెంకటగిరిలో ఘనంగా రంజాన్ పండుగ
- ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కురుగొండ్ల
వెంకటగిరిలోని దర్గాన్ని అభివృద్ధి చేస్తానని…ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ముస్లిం సోదరులకి హామీ ఇచ్చారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని…తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం 11వ వార్డు మల్లమ్మ వీధిలోని ఈద్గాలో ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ప్రార్ధనలు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రామకృష్ణ పాల్గొని…ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ముస్లిం సోరుదలందరికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే కురుగొండ్ల మాట్లాడుతూ….తమ ప్రభుత్వంలో దర్గాకి కాంపౌండ్ వాల్ మంజూరు అయ్యిందన్నారు. ప్రభుత్వం మారడంతో ఆపనులను నిలిపి వేసిందన్నారు. దర్గాలో ఆగిపోయిన పనులను కూటమి ప్రభుత్వంలో పూర్తి చేస్తామని రంజాన్ పర్వదినాన ముస్లిం సోదరులకి హామీ ఇస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పులి కొల్లు విశ్వనాథం, పట్టణ మాజీ ప్రెసిడెంట్ ఆనంద్, మాజీ కౌన్సిలర్ బీరం రాజేశ్వరరావు, వెంకటగిరి సీఐ ఏవి రమణ, ఎస్సై సుబ్బారావు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.