వెంకటగిరిలో శ్రీ పోలేరమ్మ తల్లికి విశేష పూజలు
నియోజకవర్గ ప్రజలకి ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కురుగొండ్ల
శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది మహోత్సవాలను పురస్కరించుకొని…తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో ఉగాది పండుగ వైభవంగా జరిగింది. గ్రామ శక్తి శ్రీ పోలేరమ్మ తల్లికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో…దివ్య కాంతులతో శోభాయమానంగా అలంకరించారు. పోలేరమ్మకి భక్తులు అంబళ్లు, చీరసారె సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. స్థానిక ఎస్ఐ ఆలయం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్ఐ సుబ్బారావు అమ్మవారు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక ఆలయ కమిటీ ఆయనకు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు, ఎస్సై వెంకటగిరి ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.