ఎమ్మెల్సీ ఎన్నిక కావడంలో సహకరించినందుకు మంత్రికి ధన్యవాదాలు తెలిపిన బీద
రెవెన్యూ శాఖామంత్రితో బీద భేటీ
- ఎమ్మెల్సీ ఎన్నిక కావడంలో సహకరించినందుకు మంత్రికి ధన్యవాదాలు తెలిపిన బీద
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో తాడేపల్లిలోని ఆయన నివాసంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంలో సహకరించినందుకు మంత్రికి బీద రవిచంద్ర ధన్యవాదాలు తెలియజేసి శాలువాలతో సత్కరించి బొకే అందచేశారు. ఎమ్మెల్సీగా ఎన్నికైనందున బీదకి మంత్రి అనగాని సత్యప్రసాద్, పర్చూరు శాసనసభ్యులు సాంబశివరావు, మారి టైమ్ బోర్డు చైర్మన్ Damacharla Sathyaలు అభినందనలు తెలియజేశారు.