రహదారి ప్రమాదాల నివారణే లక్ష్యం
రోడ్డు భద్రతా ఫ్లెక్సీలను ఆవిష్కరించిన అడిషనల్ ఎస్పీ సీహెచ్ సౌజన్య
నెల్లూరు పోలీసులు వినూత్న ఆలోచనలు…
- రహదారి ప్రమాదాల నివారణే లక్ష్యం
- రోడ్డు భద్రతా ఫ్లెక్సీలను ఆవిష్కరించిన అడిషనల్ ఎస్పీ సీహెచ్ సౌజన్య
రహదారి ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా యస్.పి. ఆదేశాల మేరకు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ వద్ద… టౌన్ DSP సింధుప్రియ ఆద్వర్యంలో ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో రోడ్డు భద్రత హెచ్చరిక బోర్డులను అడిషనల్ ఎస్పీ సీహెచ్ సౌజన్య ఆవిష్కరించారు.
ట్రాఫిక్ నియమాలు పాటించండి… రోడ్డు ప్రమాదాల బారిన పడకండి….ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, తాగి వాహనాలు నడపవద్దని… ట్రిపుల్ రైడింగ్ తదితర వినూత్న ఆలోచలతో ఫ్లెక్సీలను రూపొందించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ సౌజన్య మీడియాతో మాట్లాడుతూ…రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వాట్సాప్ గవర్నెన్స్ లో భాగంగా ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రజలనే వాలెంటీర్స్ గా “ట్రాఫిక్ అంబాసిడర్” అనే వాట్సాప్ గ్రూప్ నెల్లూరు టౌన్ లో నిర్వహిస్తున్నామన్నారు. వాహనదారులు, ప్రజలు ట్రాఫిక్స్ రూల్స్ తప్పని సరిగా పాటించాలని కోరారు. సౌత్, నార్త్ ట్రాఫిక్ CI రామకృష్ణ, వెంకటరెడ్డి, RSI లు చంద్రమౌళి, నాగరాజు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.