కేక్ కట్ చేసిన జనసేన నగర అధ్యక్షుడు సుజయ్‌బాబు
టీమ్ రామ్‌చరణ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు
ఘనంగా గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ జన్మదిన వేడుకలు
- కేక్ కట్ చేసిన జనసేన నగర అధ్యక్షుడు సుజయ్‌బాబు
– టీమ్ రామ్‌చరణ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు
రామ్‌చరణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని టీమ్ రామ్‌చరణ్ ఆధ్వర్యంలో గత మూడు రోజుల నుంచి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమం, కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. ఇదే క్రమంలో గురువారం నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్‌లో ఉన్న నగర జనసేన కార్యాలయంలో జనసేన నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్‌బాబు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. భారీ కేకు కోసం.. అభిమానులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా సుజయ్‌బాబు మాట్లాడుతూ.. రామ్‌చరణ్ జన్మదిన వేడుకలను జిల్లా వ్యాప్తంగా టీమ్ రామ్‌చరణ్ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తాన్ని దానం చేయడం జరిగిందన్నారు. అదే విధంగా మొక్కులు నాటే కార్యక్రమాన్ని కూడా టీమ్ రామ్‌చరణ్ నేతృత్వంలో చేపట్టారన్నారు. రానున్న రోజుల్లో రామ్‌చరణ్ తేజ అత్యున్నత స్థానాలకు ఎదగాలని కోరుకుంటున్నానని అన్నారు. తెలుగు సినీ పరిశ్రమను ప్రపంచ స్థాయికి చేర్చిన రామ్‌చరణ్‌కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే.. రామ్‌చరణ్ యువత నగర అధ్యక్షుడు సాయిమోహన్ , టీమ్ రామ్‌చరణ్ నెల్లూరు అధ్యక్షుడు వావిళ్ల బాలజీ, రాంచరణ్ అభిమాని గని ల ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరగడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి షేక్ ఆలియా, నగర ప్రధాన కార్యదర్శి శనివరపు అజయ్‌బాబు, నగర కార్యదర్శి సుమంత్, బాలు, రూరల్ ఐటీ కో-ఆర్డినేటర్ చరణ్ రామ్ , నగర మరియు రూరల్ డివిజన్ ఇంచార్జులు చిత్తూరు రాము , ఊటుకూరు శ్యామ్ , షేక్ లాల్ మస్తాన్, నగర నాయకులు మల్లిక , లోకేష్, మణి, సిసింద్రీ
తదితరులు పాల్గొన్నారు.