ఘనంగా లక్ష్మీపురం బ్రాంచ్ రత్నం స్కూల్ వార్షికోత్స వేడుకలు
అలరించిన విద్యార్థుల సాంస్కృతి కార్యక్రమాలు
విద్యార్థులకి బహుతమలు ప్రదానం చేసిన ప్రిన్సిపాల్ మానస, ఉపాధ్యాయులు
విద్యార్థులు, తల్లిదండ్రులతో కిక్కిరిసిన సోమిశెట్టి కళ్యాణ మండపం
రత్నం రేసులో అంబరాన్నింటిన సంబరాలు
- ఘనంగా లక్ష్మీపురం బ్రాంచ్ రత్నం స్కూల్ వార్షికోత్స వేడుకలు
- అలరించిన విద్యార్థుల సాంస్కృతి కార్యక్రమాలు
- విద్యార్థులకి బహుతమలు ప్రదానం చేసిన ప్రిన్సిపాల్ మానస, ఉపాధ్యాయులు
- విద్యార్థులు, తల్లిదండ్రులతో కిక్కిరిసిన సోమిశెట్టి కళ్యాణ మండపం
నెల్లూరు నగరం లక్ష్మీపురంలోని రత్నం రేసు స్కూల్ వార్షికోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. స్కూల్ ప్రిన్సిపాల్ మానస ఆధ్వర్యంలో… సంతపేటలోని సోమిశెట్టి కళ్యాణ మండపంలో వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు, చిన్నారులు చేసిన సాంస్కృతి కార్యక్రమాలు ఆధ్యంతం అందరిని ఆకట్టుకున్నాయి. చిన్నారులు చేసిన పాటలకు ఆడిటోరియం మొత్తం ఈలలు…కేరింతలతో మారుమోగిపోయింది. విజేతలకు నిలిచిన విద్యార్థినీ విద్యార్థులకు ప్రిన్సిపాల్ మానస, ఉపాధ్యాయులు బహుమతులు ప్రదానం చేసి అభినందించారు. విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రులతో కళ్యాణ మండపం కిటకిలాడింది. అనంతరం ప్రిన్సిపాల్ మానస ఎన్3 న్యూస్‌తో మాట్లాడారు. రత్నం విద్యా సంస్థల డైరెక్టర్లు రమా, వేణుల సహకారంతోనే వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించగలిగామన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, సిబ్బంది పాల్గొన్నారు.