4 ఏళ్ళ కృషి ఫలితమే ఈ రెండు ఫ్లై ఓవర్లు
ఎంపీ వేమిరెడ్డి కృషితో శరవేగంగా ఫ్లై ఓవర్ పనులు
నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
కనుపర్తిపాడు వద్ద రూ. 75 కోట్లతో నిర్మిస్తున్న ఫ్లైవోవర్ బ్రిడ్జి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
2025 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తాం…
- 4 ఏళ్ళ కృషి ఫలితమే ఈ రెండు ఫ్లై ఓవర్లు
- ఎంపీ వేమిరెడ్డి కృషితో శరవేగంగా ఫ్లై ఓవర్ పనులు
- నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
- కనుపర్తిపాడు వద్ద రూ. 75 కోట్లతో నిర్మిస్తున్న ఫ్లైవోవర్ బ్రిడ్జి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
నాలుగేళ్ల కృషి ఫలితమే రెండు ఫ్లైవోవర్ బ్రిడ్జిల ఏర్పాటు అని…రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కనుపర్తిపాడు వద్ద 75 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనులను ఆయన స్థానిక నేతలు, అధికారులతో కలిసి పరిశీలించారు. పనులు ఎలా జరుగుతున్నాయని అధికారులు, కాంట్రాక్టర్‌ని అడిగి తెలుసుకున్నారు. ఖచ్చితంగా నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. చిల్డ్రన్స్ పార్క్ జంక్షన్ వద్ద కూడా ఫ్లై ఓవర్ రావలసిన అవసరం ఉందని… స్థానిక ఎమ్మెల్యే గా నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలసి ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ప్రతి నెలకు ఒక సారి ప్రత్యేకంగా ఈ ఫ్లై ఓవర్లు పనులను పరిశీలిస్తామని చెప్పారు. 2025 డిసెంబర్ నాటికి రెండు ఫ్లైవోవర్ బ్రిడ్జి పనులను పూర్తి చేసి ప్రజలకి అంకితం చేస్తామని హామీ ఇచ్చారు.