సూళ్లూరుపేట అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ డిమాండ్
విద్యార్థిని ఆత్మహత్యపై ప్రభుత్వ సమగ్ర విచారణ జరపాలి
- సూళ్లూరుపేట అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ డిమాండ్
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని డాక్టర్ BR అంబెడ్కర్ గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని గురువారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడటం పై విచారణ జరిపించాలని అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ వారు డిమాండు చేశారు. శుక్రవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో AISF నియోజవర్గం కార్యదర్శి సూర్య, SFI స్టేట్ కమిటీ మెంబర్ నాగరాజు, PDSU జిల్లా ఉపాధ్యక్షులు నరేంద్ర మాట్లాడుతూ… అప్పుడప్పుడు గురుకుల పాఠశాలలో జరిగే సంఘటనల పైన ప్రభుత్వ సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.