ఎమ్మెల్సీ ఎన్నికకు సహకరించినందుకు మంత్రి ధన్యవాదాలు తెలియజేసిన బీద
ఎక్సైజ్ మంత్రి కొల్లుతో ఎమ్మెల్సీ బీద భేటీ
- ఎమ్మెల్సీ ఎన్నికకు సహకరించినందుకు మంత్రి ధన్యవాదాలు తెలియజేసిన బీద
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రని విజయవాడలోని ఆయన నివాసంలో ఎమ్మెల్సీ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తాను ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంలో సహకరించినందుకు మంత్రికి బీద రవిచంద్ర ధన్యవాదాలు తెలియజేశారు. మంత్రి కొల్లుని శాలువాతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్సీగా ఎన్నికైన బీద రవిచంద్రకు మంత్రి అభినందనలు తెలియజేశారు.