ఫ్యాన్సీ స్టోర్‌లో చుక్కల దుప్పి

సూళ్లూరుపేటలో ఘటన

ఫాన్సీ స్టోర్ లోకి మరో చుక్కల దుప్పి..

  • సూళ్లూరుపేటలో ఘటన

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోకి మంగళవారం మరో చుక్కల దుప్పి వచ్చేసింది. స్థానిక షార్ రోడ్డులో ఉన్న కసారెడ్డి పాలెం రోడ్ ప్రక్కనే ఓ ఫ్యాన్స్ స్టోర్ లోకి చుక్కల దుప్పి వచ్చేసింది. ఇది గమనించిన అక్కడివారు చుక్కల దుప్పిని సంరక్షించి అటవీ శాఖా వారికి సమాచారం ఇవ్వడం తో వన్యప్రాణి సంరక్షణ సిబ్బంది వచ్చి చుక్కల దుప్పిని వ్యాను లో తీసుకువెళ్లి అటవీ ప్రాంతం లో వదిలిపెట్టారు. తరచూ ఇలా చుక్కల దుప్పిలు జనావాసాలలోకి రావడాన్ని బట్టి చూస్తే వాటికి అటవీ ప్రాంతం లో త్రాగడానికి నీటి కొరత ఏర్పడ్డట్టు తెలుస్తుంది, వెంటనే చుక్కల దుప్పిలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో నీటి తొట్టిలు ఏర్పాటు చేసి వాటికి నీరు అందుబాటులో ఉండేలా అటవీ శాఖ వారు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *