కావలి పట్టణం వెంగళరావు నగర్ లోని నవవికాస్ సెంటరు వద్దనున్న వీర బ్రహ్మేంద్రస్వామి గుడిలో ప్రత్యేక పూజలు
స్థానికులు అభ్యంతరం… పూజారులను నిలదీత
రెండో పట్టణ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశామన్న స్థానికులు.
ఆ గుడిలో ఆ..పూజలు ఏంటి..?
- కావలి పట్టణం వెంగళరావు నగర్ లోని నవవికాస్ సెంటరు వద్దనున్న వీర బ్రహ్మేంద్రస్వామి
గుడిలో ప్రత్యేక పూజలు - స్థానికులు అభ్యంతరం… పూజారులను నిలదీత
- రెండో పట్టణ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశామన్న స్థానికులు
గుడి అంటే నిత్యం దీపదూప నైవేద్యాలు, నలుగురు భక్తులు వచ్చి స్వామిని దర్శించు కోవడం జరుగుతాయి. కానీ కావలి పట్టణం వెంగళరావు నగర్ లోని నవవికాస్ సెంటరు వద్దనున్న వీర బ్రహ్మేంద్రస్వామి గుడి కేవలం ప్రత్యేకమైన పూజలకు నిలయంగా మారింది. శాంతి పూజలు, వివిధ రకాల అనుమానస్పద పూజలు జరుగుతున్నాయి. ఎక్కడెక్కడ నుంచో వచ్చి గుట్టుచప్పుడు కాకుండా పూజలు జరిపించుకోవడం పట్ల స్థానికులు అభ్యంతరం చెబుతున్నారు. బుధవారం పూజలు జరుగుతుండగా స్థానికులంతా వెళ్ళి అడ్డుకున్నారు. పట్టపగలు అక్కడ జరుగుతున్న పూజలను చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకోసం ఈ పూజలు చేస్తున్నారని అడిగితే వారు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. గతంలోనూ అయ్యప్ప మాలలు వేసుకున్న స్వాములు ఇక్కడకు వస్తే మీరు ఇక్కడ ఉండకూడదని పంపించడం వీరి అనుమానాలకు ఇంకా బలం చేకూర్చుతుంది. ఒకప్పుడు ఆ గుడి ధర్మకర్త రామారావు ఎంతో కష్టపడి ఆలయ నిర్మాణం చేపట్టి భక్తులు వచ్చి పూజలు చేసుకునే విధంగా చేశారు. ఏడాదికి ఒకసారి ఆరాధనలు నిర్వహించి ఉత్సవాలు, అన్నదానాలు చేసేవారు. కానీ ఆయన చనిపోయిన అంతరం ఆయన వారసులు నిర్వహణలో ఈ గుడి ప్రత్యేక పూజలకు నిలయంగా మారింది. జన సంచారంలేని చాటుగా ఉండే ఈ గుడి కావడంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రెండో పట్టణ పోలీసు స్టేషన్లో పిర్యాదు చేసినట్లు స్థానికులు తెలిపారు.