బొబ్బల స్వేచ్ఛగా తిరుగుతున్నాడంటే..శ్రీధ‌ర‌న్న చ‌లువే

ఆనంపై సాబీర్ ఖాన్ ఫైర్‌…

బొబ్బల స్వేచ్ఛగా తిరుగుతున్నాడంటే..
శ్రీధ‌ర‌న్న చ‌లువే

  • ఆనంపై సాబీర్ ఖాన్ ఫైర్‌…

వాస్తవాలు తెలుసుకోకుండా ఆనం విజయ్ కుమార్ రెడ్డి ప్రతిదానికి రాజకీయ రంగు పులమాలని ప్రయత్నిస్తున్నారని… నీ గత చరిత్ర గుర్తు చేసుకోవాలని టిడిపి జిల్లా అధికార ప్రతినిధి సాబీర్ ఖాన్ పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే పైన వారి కుటుంబ సభ్యులమైన నీచమైన రాజకీయ పోస్టింగులు పెట్టిన కూడా సహనంతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి వ్యవహరించడం వల్లే బొబ్బల నేడు స్వేచ్ఛగా తిరుగుతున్నారన్నారు. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన తప్ప నెల్లూరు రూరల్ లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దూరమన్నారు. ప్రతి దానిని రాజకీయం చేయాలనుకునే ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఇకనైనా పంథా మార్చుకోవాలని హితవు పలికారు. వైసిపి కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ నిరుద్యోగుల నుంచి డబ్బులు దండుకొని దానిని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *