పిచ్చిచెట్లు, వ్యర్ధాలు, చెత్తతో నిండిన సామాజిక ఆరోగ్య కేంద్రం – ఎక్కడో N3 చూడండి
ఇది సీహెచ్‌సీనా…? అడవా…?
- పిచ్చిచెట్లు, వ్యర్ధాలు, చెత్తతో నిండిన సామాజిక ఆరోగ్య కేంద్రం
- ఎక్కడో… N3 చూడండి
రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలతోపాటు…చుట్టు పరిసర ప్రాంతాలు…శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చింది. కానీ ఉమ్మడి నెల్లూరుజిల్లా కోట మండలంలో మాత్రం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర మాత్రం ఎంత వెతికినా కాన రావడం లేదు. మండలంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం సమస్యలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. పెద్ద పెద్ద పిచ్చి చెట్లు…వ్యర్ధాలు…చెత్తా చెదారాలు…విష సర్పాల మధ్య సీహెచ్‌సీ నిండిపోయింది. సీహెచ్‌సీలో ఎటు చూసినా అపరిశుభ్రతే దర్శనమిస్తోంది. రాత్రయితే చాలు… దోమల ధాటికి పేషెంట్లు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ విష జ్వరాల బారిన పడుతామోనని భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి…సీహెచ్‌సీలో తాండవిస్తోన్న సమస్యలను పరిష్కరించాలని పేషెంట్లు, గ్రామస్థులు కోరుతున్నారు.