అనాధ‌లకు అండ‌గా నేస్తం

చిన్న‌య్య అనే వృద్ధుడుకి నేస్తం ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో మెరుగైన వైద్య సేవ‌లు

అనాధాశ్ర‌మంలో ఆశ్ర‌యం క‌ల్పిస్తామంటున్న నేస్తం వ్య‌వ‌స్థాప‌కుడు కోరెం

అనాధ‌లుగా అండ‌గా నేస్తం…

  • చిన్న‌య్య అనే వృద్ధుడుకి నేస్తం ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో మెరుగైన వైద్య సేవ‌లు
  • అనాధాశ్ర‌మంలో ఆశ్ర‌యం క‌ల్పిస్తామంటున్న నేస్తం వ్య‌వ‌స్థాప‌కుడు కోరెం

గ‌త వారం రోజుల క్రితం నెల్లూరు రూర‌ల్ ప‌రిధిలోని ఓ నివాసంలో ఓ వృద్ధుడు ఒంట‌రిగా దుర్భ‌ర జీవిస్తూ ఉండ‌డాన్ని నేస్తం ఫౌండేష‌న్ వ్య‌వ‌స్థాప‌కుడు కోరెం ప్ర‌వీణ్ గుర్తించి మెరుగైన వైద్య సేవ‌లు అందించి విశాలాక్షి వృద్ధుల ఆశ్ర‌మంలో ఆశ్ర‌యం క‌ల్పించిన విష‌యం తెలిసిందే. ఇదే నేప‌థ్యంలో నెల్లూరు రామ‌లింగాపురం ఫ్లైవోవ‌ర్ బ్రిడ్జి కింద చిన్నయ్య అనే వృద్ధుడు కాలు పూర్తిగా దెబ్బ‌తినింది. ఇది గ‌మ‌నించిన స్థానిక ఆటో యూనియ‌న్ నాయ‌కుడు ప్ర‌భ ఈ విష‌యాన్ని నేస్తం ఫౌండేష‌న్ కి తెలియ‌జేశారు. వెంట‌నే స్పందించిన ఫౌండేష‌న్ వ్య‌వ‌స్థాప‌కుడు కోరం ప్ర‌వీణ్ త‌న బృందం…రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధ‌ర్‌రెడ్డిల స‌హాయ స‌హ‌కారాల‌తో….వృద్ధుడి వ‌ద్ద‌కు చేరుకొని మెరుగైన వైద్య సేవ‌లు అందించేందుకు నెల్లూరులోని జీజీహెచ్‌కు త‌ర‌లించారు. చికిత్స అనంత‌రం…వృద్ధుడుని కూడా అనాధ ఆశ్ర‌మంలో ఆశ్ర‌యం క‌ల్పించి అండ‌గా నిలుస్తామ‌ని నేస్తం ఫౌండేష‌న్‌ వ్య‌వ‌స్థాప‌కుడు కోరెం ప్ర‌వీణ్ మీడియా ద్వారా తెలియ‌జేశారు. ఫౌండేష‌న్లు, స్వ‌చ్ఛంధ సంస్థ‌లు, దాత‌లు ముందుకువ‌చ్చి అనాధ‌ల‌కు అండ‌గా నిలిచి…ఆశ్ర‌యం క‌ల్పించాల‌ని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో ఫౌండేష‌న్ టీం స‌భ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *