దీనావస్థలో జీవిస్తున్న ఓ వృద్ధుడు
అన్నీతానైన నేస్తం ఫౌండేషన్
కోటంరెడ్డి సోదరుల సహకారం
వృద్ధాశ్రమంలో ఆశ్రయం కల్పించిన కోరం ప్రవీణ్
ఒంటరి వృద్ధుడు..
దుర్భర జీవితం..!
-దీనావస్థలో జీవిస్తున్న ఓ వృద్ధుడు
-అన్నీతానైన నేస్తం ఫౌండేషన్
-కోటంరెడ్డి సోదరుల సహకారం
-వృద్ధాశ్రమంలో ఆశ్రయం కల్పించిన కోరం ప్రవీణ్
నెల్లూరు రూరల్ నియోజకవర్గం ముత్యాలపాళెంలో మిద్దె శ్రీనివాసులు అనే 89 ఏళ్ల వృద్ధుడు, అతని భార్య ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. శ్రీనివాసులు సతీమణి ఐదు నెలల క్రితం కాలం చేసింది. అప్పటి నుంచి శ్రీనివాసులు తన నివాసంలో ఒంటరిగా జీవిస్తూ.. దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నాడు. ఆ వృద్ధుడి దయనీయ స్థితిని గమనించిన స్థానికులు….ఈ విషయాన్ని నేస్తం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కోరం ప్రవీణ్‌కు తెలియజేశారు. వెంటనే స్పందించిన కోరం ప్రవీణ్, ఫౌండేషన్ సభ్యులు… రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డిల సహాయ సహకారాలతో… ముత్యాలపాళెంలోని శ్రీనివాసులు నివాసానికి వెళ్లారు. శ్రీనివాసులు అనుభవిస్తున్న దుర్భర జీవితాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యారు. తినేందుకు తిండి లేక…కట్టుకునేందుకు బట్టలు లేక…ఆయన పడుతున్న బాధల్ని చూసి ఆవేదన చెందారు. వెంటనే అతనికి కేశ ఖండన చేసి…స్నానం చేయించి కొత్త దుస్తులు ధరింపజేశారు. అక్కడి నుంచి అతన్ని నెల్లూరులోని విశాలాక్షి వృద్ధుల ఆశ్రమంలో ఆశ్రయం కల్పించారు. అతనికి అన్నీ వైద్య పరీక్షలు చేయించారు. నెల నెల శ్రీనివాసులు ఆరోగ్యానికి కావాల్సిన మందులను తమ ఫౌండేషన్ ద్వారా అందజేయడం జరుగుతుందని ఈ సందర్భంగా కోరం ప్రవీణ్ హామీ ఇచ్చారు. తమ ఫౌండేషన్ చేసే ప్రతీ సేవా కార్యక్రమానికి కోటంరెడ్డి సోదరులు అండదండగా నిలిచి.. తమను అన్నివిధాలా ప్రోత్సహిస్తున్నారని…ఇందుకు వారికి ఫౌండేషన్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. శ్రీనివాసులు లాంటి ఎందరో వృద్ధులు అనాధలుగా జీవిస్తున్నారని…వారందరికి సేవా సంస్థలు, దాతలు, మంచి హృదయం ఉన్నవారు అండగా నిలిచి.. ఆదుకోవాలని కోరం ప్రవీణ్ విజ్ఞప్తి చేశారు.