ఎకరం ఉన్నా రకరకాల కూరగాయల సాగు
కూరగాయలు, పూలు, ఆకుకూరలు సాగులో మేటి
కూరగాయల కర్మాగారం డేవిస్ పేట పై N3 ప్రత్యేక కథనం
వెజిటబుల్ విలేజ్.
ఎకరం ఉన్నా రకరకాల కూరగాయల సాగు.
కూరగాయలు, పూలు, ఆకుకూరలు సాగులో మేటి
కూరగాయల కర్మాగారం డేవిస్ పేట పై N3 ప్రత్యేక కథనం.
Part 1
మనం నిత్యం వంటకు వినియోగించే కూరగాయలు నెల్లూరు మార్కెట్ కి పలు ప్రాంతాల నుంచి వస్తుంటాయి. పక్క రాష్ట్రాల నుంచి… పక్క జిల్లాలో నుంచి నిత్యం పలు సూపర్ మార్కెట్ లకు, కూరగాయలు మార్కెట్ లకు తీసుకు వచ్చి కూరగాయలను విక్రయిస్తూఉంటారు. అయితే ఏంటి అంటారా. ఒకసారి ఈ వీడియో చూడండి.
Part 2
టమోటా… వంకాయ…బెండ…మిర్చి… మొక్కజొన్న… క్యాలీ ఫ్లవర్… బంతి…చేమంతి… ఆకు కూరలు, ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపుగా అన్ని రకాల కూరగాయలు పండించడం ఆ గ్రామ రైతుల ప్రత్యేక.
Part 3
నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం డేవిస్ పేట…. ఈ గ్రామం పలు రకాల కూరగాయలకు చిరునామాగా నిలిచింది…ఇక్కడ పండించే కూరగాయలకు…ఆకు కూరలకు, పంటలకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉంది…నెల్లూరు జిల్లా వెజిటబుల్ హబ్ గా పేరుగా దేవిస్ పేట గ్రామం పై N3 ప్రత్యేక కధనం.
Part 4
దేవిస్ పేట గ్రామం లో ఉన్న ఎక్కువ శాతం గ్రామస్థులు తమకు ఉన్న భూమిలో ఎంతో కొంత కూరగాయలు సాగు చేయడం ఈ ఇక్కడ ప్రత్యేకత. తక్కువ లో తక్కువ ఒక్క ఎకరం ఉన్న రైతు నాలుగు నుంచి ఐదు రకాల కూరగాయల పంటలు సాగు చేయడం విశేషం. గ్రామంలో సుమారు 100 నుండి 150 ఎకరాల్లో అనేక రకాల కూరగాయలు, పండ్లు, పూలు, ఆకు కూరలు సాగు చేయడం దేవిస్ పేట గ్రామ రైతుల ప్రత్యేకత.
PArt 5
ఇప్పటి వరకు చూసింది నాణేనికి ఒక వైపు కాగా… పెరిగిన ఎరువుల ధరలు… సాగు ఖర్చుల నేపథ్యంలో సాగులో రాణిస్తున్న రైతన్నలు… మార్కెటింగ్ లో ధరల ఓడిదోడుకుల కారణంగా సరైన గిట్టుబాటు ధరలు లేక నష్ట పోతున్నామని… అయినా… సేద్యం పై ఉన్న మక్కువతో నష్టాలు వస్తున్నా సాగు చేస్తున్నామని రైతులు చెప్పడం గమనార్హం.