ఫోన్ పే మోసాలపై అప్రమత్తంగా ఉండండి

అప‌రిచిత ఫోన్‌కాల్స్‌కి స్పందించ‌కండి

సూళ్లూరుపేట కమిషనర్ కె.చిన్నయ్య సూచన

ఫోన్ పే మోసాలపై అప్రమత్తంగా ఉండండి

  • అప‌రిచిత ఫోన్‌కాల్స్‌కి స్పందించ‌కండి
  • సూళ్లూరుపేట కమిషనర్ కె.చిన్నయ్య సూచన

ఫోన్‌పే మోసాల ప‌ట్ల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూళ్లూరుపేట కమిషనర్ కె.చిన్నయ్య సూచించారు. తిరుప‌తి జిల్లా సూళ్లూరుపేట మున్సిప‌ల్ కార్యాల‌యంలో బుధ‌వారం ఆయ‌న ఎన్‌3 న్యూస్‌తో మాట్లాడారు. కొందరు మోసగాళ్లు జల్సాలకు అలవాటు పడి మోసాల‌కు పాల్ప‌డుతున్నార‌ని తెలిపారు. గత రెండు రోజులుగా పురపాలక సంఘం కమిషనర్ పేరుతో 79892 72438, 84348 37327 నెంబర్ల నుంచి ఇంటి పన్నులు, ట్రేడ్ లైసెన్సులు, షాపు అద్దె రుసుములు నగదును ఫోన్ పే ద్వారా చెల్లించాలంటూ కాల్స్ చేస్తున్నారన్నారు. ఇది పూర్తిగా మోసం చేస్తున్నారని, అపరిచిత నెంబర్లకు ప్ర‌జ‌లు స్పందించవద్దని సూచించారు. అధికారిక చెల్లింపులు కేవలం పురపాలక సంఘం కౌంటర్, వార్డు సచివాలయం, ప్రభుత్వ సిడిఎంఏ వెబ్సైట్ ద్వారా మాత్రమే జ‌రుగుతాయ‌న్నారు. ఇలాంటి మోసపోయిత కాల్స్ వస్తే వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని పట్టణ ప్రజలకు కమిషనర్ విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *