ధనలక్ష్మిపురం స్కూల్లో సరస్వతి పూజ
హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యాసామగ్రి పంపిణీ
ముఖ్యఅతిథులుగా హాజరైన భానుశ్రీ, షాబీర్‌ఖాన్, మోపూరు భాస్కర్‌నాయుడు
కుంచాల విజయభాస్కర్ సేవలను కొనియాడిన వక్తలు
టెన్త్ విద్యార్థులందరికీ ఆల్ ద బెస్ట్
- ధనలక్ష్మిపురం స్కూల్లో సరస్వతి పూజ
- హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యాసామగ్రి పంపిణీ
- ముఖ్యఅతిథులుగా హాజరైన భానుశ్రీ, షాబీర్‌ఖాన్, మోపూరు భాస్కర్‌నాయుడు
- కుంచాల విజయభాస్కర్ సేవలను కొనియాడిన వక్తలు
త్వరలో జరగనున్న పదవ తరగతి పరీక్షలు బాగా రాసి ఉత్తమ మార్కులు సాధించి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకునిరావాలని మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ సూచించారు. నెల్లూరురూరల్ నియోజకవర్గ పరిధిలోని ధనలక్ష్మిపురం హైస్కూల్లో హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ అధ్యక్షులు కుంచాల విజయభాస్కర్ ఆధ్వర్యంలో సరస్వతిపూజ, విద్యార్థులకు పరీక్ష సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ, శివాజీ యూత్ ఫౌండేషన్ అధినేత డాక్టర్ మోపూరు భాస్కర్‌నాయుడు, క్లస్టర్ ఇంచార్జ్ షాబీర్ ఖాన్ హాజరయ్యారు. ముందుగా పాఠశాలలో విద్యార్థులతో కలిసి సరస్వతి పూజ నిర్వహించారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులను ఆశీర్వదిస్తూ హెల్పింగ్ హ్యాండ్స్ సౌజన్యంతో అందజేసిన పరీక్ష సామగ్రిని విద్యార్థులకు వక్తలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ, క్లస్టర్ ఇంచార్జ్ షాబీర్ ఖాన్ మాట్లాడారు. విద్యార్థులు చక్కగా పరీక్షలు రాసి మంచి మార్కులు సాధించాలని సూచించారు. విద్యార్థుల అభ్యున్నతి కోసం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేస్తున్న కృషిని వివరించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హాండ్స్ సొసైటీ సభ్యులు బీరం పవన్ కుమార్ రెడ్డి, మస్తానయ్య, దుర్గంపాటి రవికుమార్, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.