సూళ్లూరుపేటలో ఓ మోస్తరు వర్షం

మండ‌ల వ్యాప్తంగా చ‌ల్ల‌బ‌డ్డ వాతావ‌ర‌ణం

సూళ్లూరుపేటలో ఓ మోస్తరు వర్షం..

  • మండ‌ల వ్యాప్తంగా చ‌ల్ల‌బ‌డ్డ వాతావ‌ర‌ణం

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలంలో మంగళవారం మధ్యాహ్నం నుంచి వాతావరణం మారింది. మంగ‌ళ‌వారం సాయంత్రం 8 గంటల నుంచి ఈదురు గాలులు వీచి ఒక్కసారిగా వర్షం ప్రారంభమైంది. మండల వ్యాప్తంగా మోస్తరు వర్షం కురవగా గ్రామీణ ప్రాంతాల వీధులు చిత్తడి చిత్తడిగా మారాయి. మండల కేంద్రంలో పలుచోట్ల వర్షపు నీరు నిలిచిపోయింది. మండల వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. ఎండాకాలం ప్రారంభం సమయంలో వాతావరణం చల్లగా మారడంతో పట్టణ ప్రజలు చల్లదనాన్ని, మట్టి వాసనను ఆస్వాదిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *