బీదాకు ఎమ్మెల్సీ పదవి పట్ల జనిగర్ల మనోహర్ యాదవ్ ఆధ్వర్యంలో సంబరాలు
బీద రవిచంద్ర మంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేసిన మనోహర్.
కావలి పాతవూరులో సంబరాలు…
- బీదాకు ఎమ్మెల్సీ పదవి పట్ల జనిగర్ల మనోహర్ యాదవ్ ఆధ్వర్యంలో సంబరాలు
- బీద రవిచంద్ర మంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేసిన మనోహర్.
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్ కు ఎమ్మెల్సీ పదవి రావడం పట్ల కావలి పట్టణం పాతవూరులో సంబరాలు మిన్నంటాయి. టిడిపి యువ నాయకుడు జనిగర్ల మనోహర్ యాదవ్ ఆధ్వర్యంలో పాతవూరు, బ్రిడ్జి సెంటరులో బాణా సంచా పేల్చి కేక్ కట్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా మనోహర్ యాదవ్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలకు పెద్ద పీట వేస్తున్నారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. టిడిపి అంటేనే బీసీల పార్టీ అని మరోమారు నిరూపించినట్లు చెప్పారు. బీద రవిచంద్ర యాదవ్ మంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మంచి పదవులు రావాలని కోరుతున్నట్లు తెలిపారు.